Anchor Keerthi: రాహుల్‌తో ఆరోజు పబ్‌లో.. నేనే పార్టీ ఇవ్వమన్నా కానీ ఆ రాత్రి ఏమైందంటే.. అసలు నిజం చెప్పిన కీర్తి

జర్నలిజం తన ప్రొఫెషన్ అని టిక్ టాక్ తన ఫ్యాషన్ అంటోంది టిక్ టాక్ సంచలనం, రెడ్డి. పొట్టి పొట్టి బట్టలతో టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ మిలియన్ల ఫాలోవర్స్‌ని రాబట్టిన ఈ యాంకర్ తన పర్శనల్ విషయాలను షేర్ చేసింది. దీనిలో భాగంగా ఇటీవల సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఇష్యూలో తన పేరు బయటకు రావడంపై ఆమె స్పందించారు. ఈ ఇష్యూపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను తాగుతా.. వోడ్కా అంటే నాకు ఇష్టం.. రెగ్యులర్‌గా నైట్ పార్టీలకు వెళ్తా.. ఎవడైనా తీస్కెల్తే పోతా.. లేదంటే ఇంట్లోనే మా అమ్మ, నేను, తమ్ముడు కలిసి తాగుతాం. మాది ఛిల్ ఫ్యామిలీ. నా కూతురిపై ఎప్పుడైనా అరుస్తుంటే అమ్మా పైకి పోయి సిగరెట్ తాగేసి రా.. కూల్ అవుతావ్ అంటుంది. ఇక రాహుల్ విషయానికి వస్తే.. తను నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు రాహుల్ సిప్లిగంజ్ పై పబ్‌లో జరిగిన గొడవ నా గురించి కాదు.. నాది అంది పెద్ద ఫిగర్ కూడా కాదు. నా గురించి వాళ్లు కొట్టుకోవడానికి. ఆరోజు నేను.. రాహుల్.. ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్లాలి. బిగ్ బాస్ తరువాత రాహుల్ ఒక ఇంటర్వ్యూలో కలిశాడు. ఆ తరువాత బాగా బిజీ అయ్యాడు. మాకు పార్టీ ఇవ్వడానికి వీలు కాలేదు. దీంతో అతనికి చాలాసార్లు ఫోన్ చేసి పార్టీ లేదా?? అని అడిగి అడిగి మానేశాం. ఒకసారి రాహుల్ ఒకసారి ఫోన్ చేసి పార్టీ ఇస్తా రండి అన్నాడు. మేం ఎప్పుడు ప్రిజమ్ పబ్‌లో కలుస్తాం. మా రెగ్యులర్ స్పాట్ అదే. ప్రిజమ్‌కి రమ్మని పిలిచాడు. ఆరోజు నాకు ఫోన్ చేసి పార్టీకి రమ్మన్నాడు.. కాని నాకు ఇద్దరు పిల్లలు ఇంట్లో ఎవరూ లేరు.. ఆరోజు వీకెండ్ కాకపోవడం వల్ల పబ్ కూడా తొందరగా క్లోజ్ చేసేస్తారు. సో.. 9.30-10కి రావడం నాకు కుదరదని చెప్పా. దీంతో ఆ పార్టీకి నేను వెళ్లలేకపోయా. గాడ్ గ్రేస్ ఏంటంటే.. నేనే ఆ గొడవలో ఉండి ఉంటే రచ్చ మరింత ఎక్కువ అయ్యేది. నా యాటిట్యూట్‌కి గొడవ ఎక్కడికో వెళ్లిపోయేది. నేను వెళ్లకపోవడం వల్ల రాహుల్ సేఫ్‌గా ఉన్నాడు.. నా ఫ్రెండ్ కూడా సేఫ్‌గా ఉంది. నేను రాహుల్‌తో ఉన్న ఆ అమ్మాయి కోసం మాట్లాడటం ఇష్టం లేదు. తను నాకు చాలా క్లోజ్.. అసలు అక్కడ ఏం జరిగింది అంటే.. రాహుల్ పాట పాడాడు.. చాలా మంది అబ్బాయిలు ఎంజాయ్ చేశారు. కాని రాహుల్ తన పని తాను చేసుకుంటుంటే.. కొంతమంది అబ్బాయిలు అటుగా వస్తూ చివరి వచ్చే వ్యక్తి అతన్ని తన్నాడు. దానికి రాహుల్ తిట్టాడు వాళ్లు కొట్టారు. నిజానికి ఆ గొడవ రాహుల్ కూడా ఉన్న ఆ అమ్మాయి గురించి కూడా.. అది అలా పెరిగి పెద్దదైంది. ప్రీ ప్లాన్‌గా రాహుల్‌పై దాడి జరిగింది. అయితే ఈ గొడవతో సంబంధం లేకుండా రాహుల్‌తో అంతకు ముందు నేను పబ్‌కి వెళ్లిన వీడియోను సెల్ఫీదిగిన వీడియోలను వైరల్ చేశారు. అవి పాత వీడియోలు.. రాహుల్ రిలీజ్ చేసిన అసలు వీడియోలో ఉన్నది నేను కాదు.. నా ఫ్రెండ్. కాని నా వీడియోలను అన్ని ఛానల్స్‌ని వాడుకున్నారు. కళ్లు ఉన్నోళ్లు నేనో కాదో తెలుస్తోంది. ఆ వీడియోలలో రాహుల్‌కి జుట్టు కూడా లేదు. రాహుల్ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఒక బ్రదర్‌లా భావిస్తా. కాని ఆ గొడవలో నాకు ఫోన్లు చేసి నువ్ ఎలా ఉన్నావు.. ఇంటర్వ్యూ ఇస్తావా? అని అడిగారు. ఒకవేళ ఆ గొడవలో నేను ఉంటే ఉన్నానని పబ్లిక్‌గా చెప్పేదాన్ని.. ఏ అమ్మాయిలు పబ్‌లకు పోకూడదా? తాగకూడదా?? నా ఫ్రెండ్ పబ్‌కి వెళ్లిందనేగా ఉద్యోగం నుండి తీసేశారు. మిడిల్ క్లాస్ వాళ్లు పబ్‌లకు పోకూడదని రూల్ పెట్టినట్టు చేశారు. నేను ఆ టైప్ కాదు.. వాళ్లు వెళ్లొద్దు అంటే అక్కడికే పోతా’ అంటూ పబ్‌లో జరిగిన గబ్బుపై అసలు విషయాలను చెప్పుకొచ్చారు యాంకర్ కీర్తి. Read Also:
Comments
Post a Comment