రానా చెప్పిన ‘వైజయంతి’ కథ: 21 ఏళ్ల కుర్రాడి కల.. ఎన్టీఆర్ హస్తవాసి

తెలుగు సినిమా పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా ‘ఎదురులేని మనిషి’ సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం 45 ఏళ్లకు పైగా సుధీర్ఘంగా సాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న సినీ వారసులను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. సినిమాలపై మక్కువతో 21 ఏళ్ల వయసులో అశ్వనీదత్ బెజవాడ నుంచి చెన్నపట్నం బయలుదేరారు. ఎన్టీఆర్‌తో ఎలాగైనా సినిమా చేయాలనే బలమైన కోరిక ఆయన్ని ఇండస్ట్రీ వైపు నడింపించింది. టాలీవుడ్‌ గర్వించదగిన నిర్మాతను చేసింది. Also Read: జేబులో కొంత డబ్బు, గుప్పిట్లో సినీ తెర కలలు, గుండెనిండా ధైర్యంతో బెజవాడలో 21 ఏళ్ల అశ్వనీదత్‌ రైలు ఎక్కుతుండగా ఆయనకు డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కనిపించారట. మళ్లీ ఊరికి తిరిగివస్తే ఆయనలా ఒక గొప్ప నిర్మాతనై రావాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నారట. ఆ ప్రయాణానికి ఒక చారిత్రాత్మిక నాంది ఎలా పడిందో రామానాయుడు మనవడు అయిన రానా దగ్గుబాటితో చెప్పించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ వెనకున్న అసలు కథను తెలియజేస్తూ ఆ సంస్థ ఒక వీడియోను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ వీడియోలో రానా.. వైజయంతీ మూవీస్ ప్రయాణం గురించి చెప్పారు. అసలు ఈ సంస్థకు ఆ పేరు ఎలా పెట్టారో వెల్లడించారు. Also Read: ‘‘గత ఐదు దశాబ్దాలుగా ప్రతీ జనరేషన్‌కు తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తోన్న సంస్థ వైజయంతీ మూవీస్. కానీ, ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్వనీదత్ 21 ఏళ్ల వయసులో కె.విశ్వనాథ్ గారి ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ, ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమేనా? పట్టు వదలని విక్రమార్కుడిలా.. మొండితనమో, పట్టుదలో కానీ చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్‌మెంట్ సాధించారు. తనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి.. అతని మాటలకు ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్ గారు బ్యానర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది.. బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిది అయితే బాగుండు అని దత్ గారి మనసులో ఉంది. కానీ, బయట పెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి.. ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోను చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం మరిమళాలను వెదజల్లుతూ ఎన్నటీ వాడిపోని ‘వైజయంతి’.. అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో వైజయంతీ మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు.. వైజయంతీ ఎప్పటికీ వాడిపోని, వన్నెతరగని ఘన విజయాలను అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు.. ఏ వేళా విశేషమో, ఆ మహానుభావుడి హస్తవాసో.. ఆ నాటి నుంచి వైజయంతీ మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది’’ అంటూ వీడియోలో రానా వివరించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ