Karate Kalyani: కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌పై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్‌లు.. ఛీ.. బాబోయ్!

వర్సెస్ కరాటే కళ్యాణిల మధ్య వార్ కొనసాగుతోంది. మధ్యలో వివాదాస్పద కొరియోగ్రాఫర్ సైతం చేరి శ్రీరెడ్డిని టార్గెట్ చేయడంతో వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బూతుల వర్షం కురిస్తోంది. ఎవరికి వారే బూతుల్లో పీహెడీ చేసినట్టుగా బూతు పంచాంగాలను విప్పుతున్నారు. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా , రాకేష్ మాస్టర్‌లపై బూతులు ఇలా కూడా తొట్టొచ్చా అన్నంతగా ఓ రేంజ్‌లో ఏకిపారేసింది. ఇక కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లు సైతం బూతుల్లో ఏం తక్కువ కాదన్నట్టుగా మీడియాకి ఎక్కి మరీ బూతులు మొదలెట్టారు. అయితే వీరి మధ్య దూషణల పర్వం పెరిగి పెద్దది కావడంతో శ్రీరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టింది నటి కరాటే కళ్యాణి. ఈ ఇష్యూపై వివాదం నడుస్తున్న సందర్భంలో మరో మారు కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లను టార్గెట్ చేస్తూ ఆదివారం నాడు ఓ వీడియో వదలింది శ్రీరెడ్డి. ‘కరాటే కళ్యాణి గారూ బాగున్నారండీ.. రాకేష్ బాబాయ్ బాగున్నారా? ఏంటి.. నా మీద కేసు పెట్టారంట కదా.. భలే పాపులర్ చేస్తున్నారుగా.. నన్ను పాపులర్ చేయడం అంటే రాకేష్‌కి, కళ్యాణికి బాగా ఇష్టం కదా థాంక్యూ.. ఇప్పుడు విషయం ఏంటంటే.. కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే రివర్స్‌లో పరువు నష్టం దావా వేస్తా’ అంటూ వీడియోలో వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. అయితే మంగళవారం నాడు బూతులపర్వం మొదలుపెడుతూ.. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలపై సంచలన పోస్ట్‌లు పెట్టింది శ్రీరెడ్డి. వాళ్ల పేర్లను సగం.. సగం రాస్తూ ఇన్ డైరెక్ట్‌గా బండబూతులు తిడుతూ పోస్ట్‌లు పెట్టింది. రాయడానికి వీలులేని భాషలో రాకేష్ మాస్టర్, కళ్యాణిలకు సంబంధం అంటగడుతూ దారుణమైన పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. రాకేష్ మాస్టర్‌కి ఎయిడ్స్ అంటూ కళ్యాణిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేదంటూ నెలకు ఒకసారి చెన్నై కోర్టు చూసి వెళ్దురు గాని.. మీరందరూ రండి కుళ్లు అక్క, రెక్క బాబాయ్.. రండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక మరో పోస్ట్‌లో బండ బూతులు తిడుతూ రాయడానికి వీలు లేని బూతులు తిట్టేసింది. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ పులిహోర, దద్దోజనం, సోషల్ వేస్ట్, మిర్రర్ లో తొర్రి అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆ ఛానల్స్ పేర్లను ప్రస్తావిస్తూ కేసులకు రెడీగా ఉండండి అంటూ హెచ్చరించింది శ్రీరెడ్డి. పేకాటలో పోలీసులు పట్టుకున్న *** నిన్ను చూసి నేను డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నానా? తూ బతుకు అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ