Sivaji: జగన్ గారికి ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థంకావట్లేదు

మరోసారి నటుడు ఆపరేషన్ గరుడ అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆపరేషన్ గరుడ గురించి తాను చెప్పినవన్నీ చెప్పినట్లే జరుగుతున్నాయని, మున్ముందు కూడా అలాగే జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారికి రాజధానిని మార్చాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యలు చేసారు. ‘నాకు గరుడ పురాణం శివాజీ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. ఆ పేరు పెట్టిన వారిని అడగాలి. ప్రతీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. మనకు రాజకీయాలపై మంచి పట్టు ఉంటే మనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. నేను మీడియా ముందుకు వచ్చి సినిమా కథను పంచుకుని ఉంటే అది వేరే విషయం. నాకు వచ్చిన సమాచారాన్నే చెప్పాను. కొమ్మినేని శ్రీనివాస్ నాకు గరుడ పురాణ శివాజీ అని పేరు పెట్టానని నేను అనుకుంటున్నాను. అతనికి ఫోబియా ఉందేమో. ఎవరి అభిప్రాయాలతో ఆయన అంత సులువుగా ఏకీభవించకపోవచ్చు. నేను చెప్పిన గరుడ కథ అంతా చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు సగం జరిగాయి. మిగితా సగం జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుగారి పతనం అనేదే లక్ష్యం.’ READ ALSO: ‘చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది అంటే అది భావితరాల కర్మ. అలాగని నేను చంద్రబాబు రైట్ అనట్లేదు. ఆయన పరిపాలనలోనూ చాలా తప్పులు జరిగాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పులు జరగకుండా ఎలా ఉంటుంది. తప్పులు జరిగినప్పటికీ అవన్నీ కొందరు వ్యక్తులు చేసినవే. అంతేకానీ చంద్రబాబు తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. కానీ జగన్ గారు అవినీతి పరుడు అని నేను ఏ రోజూ చెప్పలేదు. ఆయన తప్పులు రుజువు కానంతవరకు ఆయన నిర్దోషే. చంద్రబాబు నాయుడుగారి పాలనలో మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తప్పులు చేసిన మాట వాస్తవం. అందువల్లే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు అంటే నేను నమ్మను’ ‘ఇప్పుడు జగన్ నాయకత్వంలో, మోదీ, ట్రంప్ నాయకత్వంలో అద్భుతమైన పాలన ఏమైనా నడుస్తోందా? ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న ఫోబియా ఏంటంటే.. ఎవరు అధికారంలో ఉంటే వాడు తోపు. అలాంటివాళ్లు మీడియాను నాశనం చేస్తారు. వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదు. మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నా. మొత్తానికి ఇక్కడ బలైపోతోంది మాత్రం ప్రజలు. ఏపీలో చంద్రబాబును ఓ పద్ధతి ప్రకారం అధికారం నుంచి లేపేశారు. ఇది నిజం. చాలా నీచమైన స్థితిలో నేడు ప్రజాస్వామ్యం ఉంది. ఇది మారకపోతే భవిష్యత్తు తరాలు నాశనమైపోతాయి. నేను చెప్తున్నా రాసిపెట్టుకోండి’ READ ALSO: ‘ఓసారి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోయింది అంటే అన్ని మీడియా వర్గాలు, పార్టీలు తెగ బాధపడిపోయి ఆయన్ను అనరాని మాటలు అన్నాయి. కానీ ఆయన చెప్పిందే నిజం. అత్యంత దృఢమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశం మనది. దాన్ని కూడా తూట్లు పొడుస్తు్న్నారు. దేశంలో మీడియా గొంతు నొక్కేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటో తెలీనప్పుడు ఇంట్లో కూర్చోండి. అధికారంలోకి రాగానే జగన్ గారికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ రాజధాని విషయం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. మోదీ తెచ్చిన వ్యవస్థను కూడా జగన్ మార్చేస్తున్నారు. పోనీ జగన్ అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే రెఫరెండమ్ ప్రవేశపెట్టచ్చు కదా’’ అని తెలిపారు శివాజీ.
Comments
Post a Comment