PSPK28: కన్ఫర్మ్.. మరోసారి ‘గబ్బర్ సింగ్’ కాంబో

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లా్క్ బస్టర్ విజయం సాధించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. READ ALSO: పవన్ సినిమాల గురించి అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ‘అసలైన న్యూస్ అంటే ఇది కదా.. ’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. దాంతో పవన్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ కపూర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇందుకు కారణం తనపై కుటుంబాలు, పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉండటమేనిన క్లారిటీ కూడా ఇచ్చారు. ‘పింక్’ తెలుగు రీమేక్ చేస్తుండగా 27వ సినిమాను క్రిష్ జాగర్లమూడితో చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఇందులో పవన్ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇంకా సినిమాకు ఏ టైటిల్ అనుకోలేదు. ఫిబ్రవరి 4 నుంచి షూటింగ్ జరుగుతుందట.
Comments
Post a Comment