Prabhas: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, రాజమౌళి ఢీ?

ఇద్దరూ కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరే బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నారట. వారెవరో కాదు.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాధాక్రిష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అందుకే ముందుగా అనుకున్న జులై 30న కాకుండా సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. మరోపక్క ‘జాన్’ సినిమాను కూడా అక్టోబర్‌లో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రవర్గాలు అనుకుంటున్నాయట. అలా ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద ఢీకొనే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పైగా రెండూ ప్యాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. READ ALSO: ‘ఆర్ ఆర్ ఆర్’లో రామ్ చరణ్‌ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు అనుకున్న సమయానికే షూట్ చేసేసి ఉంటే సినిమా అనుకున్న తేదీనే విడుదల చేసేవారు. కానీ చరణ్ ‘సైరా’ ప్రమోషన్స్‌లో పడి బిజీ అవడంతో షూట్ కాస్త ఆలస్యం అయింది. మరోపక్క ప్రభాస్ సినిమా కూడా కొన్ని రోజులు వాయిదా పడింది. దాంతో ఇంకా డిలే చేసుకుంటూపోతే కుదరదు అనుకుని ఎంత త్వరగా వీలైతే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఏదేమైనా ప్రభాస్, రాజమౌళికి బాక్సాఫీస్ క్లాష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవన్నీ వారికి వెన్నతో పెట్టిన విద్య. చిత్రపరిశ్రమలో టాప్ స్థానాల్లో ఉన్న వీరికి ఎప్పుడు సినిమా విడుదల చేయాలో తెలీదా ఏంటి...! READ ALSO:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ