Hyper Aadi: అనసూయా.. మన ప్రేమకు వారధి సారధి స్టుడియో: హైపర్ ఆది ఆగట్లేదే

బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో.. ప్రతి స్కిట్‌లోనూ ఈ ఇద్దరి మధ్య ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్-రష్మిల జోడీగా బయట కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పండుతోంది. అయితే వాళ్లేనే మేం రొమాన్స్ పండించలేమా?? అంటూ తెగ తాపత్రాయపడుతున్నారు మరో జబర్దస్త్ జంట , హైపర్ ఆదిలు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ‘జబర్దస్త్’ స్కిట్‌లలో రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆది.. అనసూయ వెంటపడటం, అనసూయ తెగ సిగ్గుపడిపోతూ ఆదిని ఓ రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉండటం షరా మామూలుగానే కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ జబర్దస్త్‌లోనే కాదు.. అనసూయ హోస్ట్ చేస్తున్న ప్రతిరోజు పండగే షోకి కూడా షిప్ట్ చేశారు. సెలబ్రిటీస్‌కి కామన్ ఉమెన్స్‌కి పోటీ అంటూ అనసూయ యాంకరింగ్ చేస్తున్న ‘’ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఇందులోనూ గులాబీ పువ్వు పట్టుకుని మరీ అనసూయ వెంటపడుతున్నాడు . ‘హాయ్.. ఆది!! నువ్ ఏంటి ఇక్కడ అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ అడగ్గా.. ‘నువ్విక్కడుండీ.. నేను అక్కడ ఉంటే ప్రాణం విలవిలా’ అంటూ పువ్వు ఇచ్చి మరీ పాట అందుకున్నారు ఆది. ‘ఇది జబర్దస్త్ కాదు.. సారధి స్టుడియో’ అని అనసూయ చెప్పగా.. ‘అంటే.. ఇకనుంచి మన ప్రేమకు వారధి సారధి’ అంటూ పంచ్ పేల్చారు హైపర్ ఆది. ఆడవాళ్ల షోలో నీకేం పని అని కంటెస్టెంట్ ఒకరు అడగ్గా.. ‘మీ ఆట మీరు ఆడుకోండి.. నేను అనసూయ మనసు దోచుకోవడానికి వచ్చా’ అంటూ మరో హైపర్ పంచ్ వేశారు. సోమవారం నుండి శనివారం వరకూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న ఈ షో ఈటీవీలో త్వరలో ప్రారంభం కానుంది.
Comments
Post a Comment