అశ్లీల వీడియోలు పంపుతున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి

అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలతో పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు సినీ నటి . దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్‌ చూడాలంటేనే భయం వేస్తోందని తెలిపారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్‌ చేసినా వేరే ఫోన్‌ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో కథనాలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు. READ ALSO: ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టకూడదని, కావాలంటే ముస్లిం, క్రైస్తవ పేర్లు పెట్టుకోండి అంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి సైబర్ వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ