96 Remeke ‘జాను’ ట్రైలర్ టాక్: రేయ్.. అసలేం జరుగుతోందిరా అక్కడా?

‘‘ఎగిసిపడే కిరటాల్లో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు నీ చూపు అప్పు ఈయలేవా” అంటూ ఎమోషనల్ టచ్‌తో శర్వానంద్, సమంతల ‘జాను’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. మంచి ఎమోషనల్ ఫీల్తో ఒరిజినల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా శర్వానంద్, సమంతలు జీవించేస్తున్నారు. టీనేజ్ లవ్ స్టోరీతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ శర్వానంద్ తెగ సిగ్గుపడిపోవడం యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. “ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏదో జరగపోతుందని మనసుకి మాత్రం ముందే తెలుస్తుంది” అంటూ సమంత చెప్పే డైలాగ్.. ‘పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్ సొంతం అయితే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఊహలే ఊహలే నినువీడవులే అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైప్ ఇచ్చే విధంగా ఉంది. గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేందరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా ‘96’ చిత్రానికి రీమేక్ కాబట్టి.. ఆ సినిమాతో పోలిక తప్పనిసరి అయితే.. సమంత, శర్వానంద్‌లు నటనలో విజయ్ సేతుపతి, త్రిషలను బీట్ చేయలేకపోయారనే ఫీల్ అయితే కలుగుతుంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ