Sri Reddy: నా కాళ్లు పట్టుకుంటానని.. ఇప్పుడు ఆమె కాళ్లపై పడ్డావేం వర్మా.. నేను హర్టూ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఆమె హీరోయిన్ కాళ్లపై పడటం ఏంటి? మరీ ఇంత దిగజారిపోయాడా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే చర్చ. వర్మ శిష్యుడు అగస్థ్య మంజు దర్శకత్వం వహించిన ‘బ్యూటిఫుల్’ మూవీ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సినిమాను ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి తన పంథా మార్చి వింత వ్యక్తిగా మారారు. ప్రమోషనల్ ప్రెస్ మీట్‌లలో హీరోయిన్స్ నైనా గంగూలీతో పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ ఆమెతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రీ న్యూ ఇయర్ పార్టీ పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించిన వర్మ.. అక్కడ తాగుతూ తూలుతూ ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో డాన్స్ చేసి వింతగా ప్రవర్తించారు. ‘కసితీరా’ అంటూ బ్యూటిఫుల్ హీరోయిన్ నైనా గంగూలీతో డాన్స్ చేసి ఆమె కాళ్లపై పడ్డాడు. నైనా కాళ్లపై వర్మ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వర్మ మాదిరే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి వర్మ చేసిన పనికి ఫసక్ లాంటి పంచ్‌లేసింది. ‘వర్మ నన్ను చీట్ చేశారు.. నన్ను దేవత అని పొగుడుతూ.. నా కాళ్లు పట్టుకుంటాన్నారు.. ఇప్పుడేమో ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్నారు.. నేను హర్ట్ అయ్యా’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి.
Comments
Post a Comment