అలా చేయటం మాట తప్పటమేం కాదు: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించిన చాలా సంఘటనలపై వర్మ సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు. అలా చెప్పిన చాలా సినిమాలు రిలీజ్ చేశాడు కూడా. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు అలా తెరకెక్కించినవే. అయితే వర్మ ఇలా పదుల సంఖ్యలో సినిమా టైటిల్స్ ఎనౌన్స్ చేశాడు. అమ్మ, కుర్చీ. రెడ్డిగారు పోయారు, నయీం, శశికల ఇలా రాష్ట్రాన్నీ కదిలించే స్థాయి సంఘటన ఏది జరిగినా ఏదో ఒక సినిమా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తూ వచ్చాడు వర్మ. Also Read: తాజాగా అలా తాను ఎనౌన్స్ చేసిన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు వర్మ. తాను ప్రకటించిన నయీం, శశికల సినిమాలు తానే మర్చిపోయానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు తాను అలా పక్కకు పడేసిన టైటిల్స్, సినిమాలు దాదాపు 10 వరకు ఉంటాయని చెప్పాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కొన్ని లైన్స్, టైటిల్స్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. కానీ తరువాత సినిమాగా తెరకెక్కించే అంత కంటెంట్ రెడీ కాకపోవటంతో ఈ ప్రాజెక్ట్స్ పక్కనపడిపోతాయి. అలాగే వర్మ చాలా సినిమాలను పక్కన పడేశాడు. అయితే సినిమా ఎనౌన్స్ చేసి చేయకపోవటం మాట తప్పటం ఏం కాదంటున్నాడు వర్మ. Also Read: తాజాగా వర్మ నిర్మాణంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ సూపర్ హిట్ రంగీలాకు ట్రిబ్యూట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి బోల్డ్ రోల్‌లో నటించింది. ప్రస్తుతం వర్మ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Comments
Post a Comment