సమ్మర్‌లో రానున్న మరో మెగా హీరో.. మెప్పిస్తాడా?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వెండితెరను ఏలేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యువ నటుడు చేరనున్నాడు. మెగాస్టార్ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వైష్ణవ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతికా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటిస్తుండటం విశేషం. Also Read: ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో వైష్ణవ్ చేపలు పట్టే కుర్రాడి పాత్రలో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. మెగా హీరో లాంచింగ్ మూవీ కావటంతో ప్రతీ ఒక్కరు ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వహిస్తుండగా రంగస్థలం ఫేం రామకృష్ణ, మౌనికలు ఆర్ట్ వర్క్ బాధ్యతలు చూస్తున్నారు. నవీన్ నూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై అవుట్‌పుట్‌పై చిత్రయూనిట్ చాలా హ్యాపిగా ఉన్నారు. Also Read:
Comments
Post a Comment