‘భీష్మ’ సింగిల్స్ యాంథమ్: ఒంటిలో మంటల్ని చల్లార్చే పాప అంటోన్న నితిన్

యంగ్ హీరో నితిన్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. కిందటేడాది ఆయన హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. అంతకు ముందు సంవత్సరం వచ్చిన ‘లై’ కూడా ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’నే నితిన్‌ను చివరి హిట్టు. దీంతో ఈసారి ఎలాగైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాలని నితిన్ చూస్తున్నారు. అందుకే ‘ఛలో’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుములతో జతకట్టారు. నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే సినిమాపై అంచనాలను పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ‘భీష్మ’ నుంచి తొలిపాటను విడుదల చేశారు. Also Read: లవర్లు లేని సింగిల్స్‌కు ఈ పాటను అంకితమిస్తూ ‘సింగిల్స్ యాంథమ్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందంచగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. నిజానికి మహతి ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. వెంకీ కుడుముల గత చిత్రం ‘ఛలో’కి కూడా ఈయనే సంగీత దర్శకుడు. కాగా, ‘భీష్మ’ చిత్ర కథ, కథనం, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు వెంకీ కుడుముల చెప్పారు. ప్రతి అబ్బాయి నితిన్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశామన్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని.. వినోద ప్రధానంగా సాగుతుంది తెలిపారు. ఈ చిత్రంలో నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ నటిస్తున్నారు.
Comments
Post a Comment