అశ్వథ్థామకు సూపర్ రెస్పాన్స్.. టాప్‌లో ట్రెండ్ అవుతున్న టీజర్

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ . ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 31న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ శుక్రవారం టీజర్ను రిలీజ్ చేశారు. యాక్షన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ డిజైన్ చేసిన గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం టాప్ ట్రెండ్ అవుతున్న ఈ టీజర్ మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది. నాగశౌర్యకు జోడిగా మెహరీన్ నటిస్తున్న ఈ సినిమాకు రమణతేజ దర్శకుడు. శ్రీచరణ్ పాకల సంగీతమందిస్తున్నాడు. Also Read: థ్రిల్లర్‌గా కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు హీరో నాగశౌర్య కథ అందించటం విశేషం. గతంలో ఛలో సినిమాకు కూడా కథ అంధించిన నాగశౌర్య అప్పట్లో టైటిల్ క్రెడిట్స్ తీసుకోలేదు. అయితే ఈ సినిమా విషయంలో ఆ తప్పు చేయదలచుకోలేదని అందుకే టైటిల్‌లో కథ తనదే అని వేస్తున్నట్టుగా చెప్పాడు. Also Read:
Comments
Post a Comment