‘బ్యూటిఫుల్’ హీరోయిన్‌కి ‘జార్జిరెడ్డి’ హీరో ఛాలెంజ్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో వస్తోన్న ‘బ్యూటిఫుల్’ సినిమా హీరోయిన్ నయనా గంగూలీకి ‘జార్జిరెడ్డి’ హీరో సందీప్ మాధవ్ ఒక ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఏంటా ఛాలెంజ్ అనుకుంటున్నారా..? ఈ మధ్య సెలబ్రిటీలు ఒకరిపై ఒకరు విసురుకుంటోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చెట్లను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే కాన్సెప్ట్‌తో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సందీప్ మాధవ్.. బుధవారం మోతినగర్ పార్కులో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో తాను కూడా భాగస్వామి అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో సంతోష్ ఏ కార్యక్రమం చేపట్టినా తాను తోడుగా ఉంటానని సందీప్ మాధవ్ హామీ ఇచ్చారు. కాగా, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సందీప్ మాధవ్ మరో నలుగురురికి విసిరారు. డైరెక్టర్ జీవన్ రెడ్డి, హీరోయిన్ నయనా గంగూలీ, నటుడు శత్రువు, హీరోయిన్ కుంప్ చాందినికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, కాలనీ అధ్యక్షులు ఇందర్ సింగ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Comments
Post a Comment