సత్యదేవ్‌తో నిత్యా మీనన్.. 1979లో సాగే పీరియాడిక్ మూవీ!

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు సత్యదేవ్ కంచరన. ఈయన సోలో హీరోగానూ సినిమాలు చేస్తున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో తన నటనలోని పవర్ ఏంటో చూపించారు సత్య. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఆయన ఇంకా సరైన బ్రేక్ అయితే రాలేదు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా మరో సినిమాను అంగీకరించారు. సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. 1979లో సాగే పీరియాడిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ కె.రవికిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ బ్యానర్‌పై దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. సాంకేతిక నిపుణులు: మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ కందెరావ్ సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల మ్యూజిక్: ప‌్రశాంత్ ఆర్ విహారి
Comments
Post a Comment