Samantha: ఆ చావుకు నేనే కారణం అనుకున్నా, గుండె పగిలేలా ఏడ్చా

అక్కినేని నాగచైతన్య, రెండు అమెరికన్ పిట్ బుల్స్‌ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వాటి పేర్లు హష్ అక్కినేని, డ్రోగో అక్కినేని. ఇటీవల సమంత, నాగ చైతన్య హష్ తొలి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. తన ఫ్రెండ్స్‌ని పిలిపించి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటుచేశారు. అయితే హష్, డ్రోగో కంటే ముందు సమంత బూగబూ అనే కుక్క పిల్లను పెంచుకునేదట. అయితే దానికి ఓ వింత వైరస్ సోకి నాలుగు నెలల వయసులోనే చనిపోయిందట. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘వీడియోలో మీరు చూస్తున్న కుక్కపిల్ల హష్ కాదు. దాని పేరు బుగాబూ. దీనిని ఇంటికి తెచ్చుకోవడానికి ముందు కుక్కల్ని ఎలా పెంచాలో 30 రోజుల పాటు కోర్స్ తీసుకున్నాను. నాకు జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిసింది కాబట్టి కుక్క విషయంలోనూ అలాగే ఉండాలని అనుకున్నాను. కానీ నేను నిజానికి చాలా దూరంలో ఉన్నానని తక్కువ సమయంలోనే తెలిసింది. బుగాబూని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దానికి పార్వో అనే వైరస్ సోకిందని తెలిసింది. ఇంట్లోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే అది చనిపోయింది. ఆ సమయంలో నేను గుండె పగిలేలా ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికీ గుర్తే’ ‘దాని చావుకు నేనే కారణం అనుకున్నాను. ఇంకెప్పుడూ మరో కుక్కను తెచ్చుకోకూడదు అనుకున్నాను. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత చై మరో కుక్కను తెచ్చుకుందాం అన్నాడు. చైకి నాకంటే అన్నీ బాగా తెలుసు కాబట్టి ఓకే అన్నాను. అప్పుడు హష్ ఇంటికి వచ్చింది. అయితే బుగాబూకి పార్వో అనే వైరస్ సోకినప్పుడు ఆ వ్యాధి గురించి రీసెర్చ్ చేశాను. అది ఒక్కసారి ఇంట్లోకి వస్తే నెలలు పాటు అలాగే ఉంటుందట. దాంతో హష్‌కి కూడా అంటుకుంటుందేమోనని ఆ వైరస్ పోవడానికి వెటర్నరీ డాక్టర్‌ను, డాగ్ ట్రైనర్‌ని, నా స్నేహితులను టార్చర్ పెట్టాను. హష్ ఇంటికి వచ్చిన కొన్ని వారాల పాటు నరకం అనుభవించా’ ‘పీడ కలలు వచ్చేవి. హష్‌కి ఏమన్నా అవుతుందేమోనని రాత్రిళ్లు ఏడుస్తూ ఉండేదాన్ని. మొత్తానికి హష్‌కు ఏడాది నిండింది. ఇప్పుడు మీకు అర్థమైందా.. హష్ తొలి బర్త్‌డే రోజున నేను ఎందుకు ఇంతగా ఎగ్జైట్ అవుతున్నానో. నేను ఏం చెప్పాలనుకున్నానంటే.. మన లైఫ్ ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండదు. కాబట్టి మీరు మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించకండి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి అనుష్క శర్మ హార్ట్ సింబల్‌తో రియాక్ట్ అయ్యారు. అనుష్కకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కల కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో ఓ షెల్టర్ కట్టించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ