బాబోయ్ యాంకర్‌గా Nayanthara ఎలా ఉందో చూశారా?

ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నేడు లేడీ సూపర్‌స్టార్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు . 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో నయన్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే నయన్ సినిమాల్లోకి రాకముందు ఓ మలయాళం ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసేవారన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు. నయన్ యాంకర్‌గా వార్తలు చదువుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పనిచేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు కానీ చాలా మంది ఆమె లుక్స్ చూసి షాకయ్యారు. స్టార్ నటీనటుల పాత కాలం నాటి ఫొటోలు, వీడియోలు బయటికి వస్తే అవి ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి ఫ్యాన్స్‌కి కూడా తెలీకపోవచ్చు. వీడియోలో నయన్ వాయిస్ కూడా చాలా షాకింగ్‌గా ఉంది. తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రమే నయన్ తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగు ప్రేక్షకులు నయన్ సొంత వాయిస్ ఎప్పుడూ వినలేదు. దాంతో తొలిసారి నయన్ ఒరిజినల్ వాయిస్ విని తెలుగు ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు నయన్.. లేడీ రజినీకాంత్, కమల్ హాసన్ అనిపించుకుంటున్నారు. ఏ హీరో పక్కనైనా సరిగ్గా సరిపోయే అందం, అభినయం నయన్‌ది. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో నయన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నయన్ డేట్ల కోసం హీరోలు వెయిట్ చేసేంతగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భార్యగా కనిపించిన నయన్ తమిళంలో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యాక తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Comments
Post a Comment