నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు.. ‘కమ్మ’ అంటే నాకు ఇష్టం: వర్మ ఇంటర్వ్యూ

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈ సినిమా ఇంకా విడుదలవ్వకపోయినా చేయాల్సినంత రచ్చ అయితే చేసేసింది. సినిమా టైటిల్ మొదలుకొని పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు, పాటలు ఇలా ప్రతి ఒక్కటీ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని చాలా మంది విమర్శించారు. ఇలాంటి సినిమా విడుదల కావడానికి వీళ్లేదని వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ప్రధానంగా చేసుకుని వివాదాస్పదమైన సెటైరికల్ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మను తాజాగా ‘సమయం’ పలకరించింది. ఆయనతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో ‘సమయం’ అడిగిన పలు ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. Also Read: కడప అంటే తనకేమీ ప్రత్యేకమైన అభిమానం లేదని, కడపకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అన్నారు. కడప నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్ లాంటి ఎంతో మంది నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, సినిమా సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్ పెట్టామని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తాను వ్యతిరేకం అనే మాట వాస్తవం కాదని వర్మ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరగడం, కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం, ఆ తరవాత అక్కడికి కడప రెడ్లు రావడం అనేది జగమెరిగిన సత్యమని.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక డ్రమేటిక్ స్టోరీని తీశానని వర్మ చెప్పారు. ఒకరికి వ్యతిరేకంగా సినిమా తీయాలనే అజెండా తనకు లేదని స్పష్టం చేశారు. Also Read: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తాను తీయలేదని, ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో చెప్పడమే తన ఉద్దేశం అని వర్మ అన్నారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ ‘కమ్మోళ్ల’ మీద ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ‘కమ్మ’ సామాజిక వర్గం అంటే తనకు ఇష్టమని, సినిమాలో వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చూపించడంలేదని వెల్లడించారు.
Comments
Post a Comment