వర్మకు షాక్‌ ఇచ్చిన హైకోర్టు.. `కమ్మ రాజ్యంలో..` రిలీజ్‌కు బ్రేక్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం . ఈ శుక్రవారం (29-11-2019) రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాకు తెలంగాణ హైకోర్ట్‌ బ్రేక్‌ వేసింది. వర్మ ఈ సినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. కొంత మంది వ్యక్తులను కించపరిచేలా వర్మ తన సినిమాలో పాత్రలను చూపించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై కేఏ పాల్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే వర్మ ఇవేవి పట్టించుకోకుండా సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు హైకోర్ట్‌ వర్మకు షాక్‌ ఇచ్చింది. Also Read: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై దాఖలైన పిటీషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సోలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌ రావు సినిమాకు ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వలేవని కోర్టుకు తెలిపారు. సినిమా విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌ బోర్డ్‌కు హైకోర్టు సూచించింది. వారం రోజుల్లోగా వివాదాలను పరిష్కరించి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న సినిమా టైటిల్‌ను మార్చాలని చిత్రయూనిట్‌ను ఆదేశించింది. అయితే ఇప్పటికే టైటిల్‌ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చామని కోర్టు తెలిపాడు వర్మ. సినిమాక వీలైనంత త్వరగా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ