అయోధ్య తీర్పు నేపథ్యంలో సినిమా.. వివాదానికి తెర తీస్తున్న బాహుబలి రచయిత

బాహుబలి సినిమాతో కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన భజరంగీ బాయ్‌జాన్‌కు కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందించారు. ఆ తరువాత కూడా మణికర్ణిక లాంటి చారిత్రక చిత్రాలకు కొన్ని కమర్షియల్‌ సినిమాలకు పనిచేశారు ఈ స్టార్‌ రైటర్‌. ప్రస్తుతం దక్షిణాదిలో వివాదాస్పద బయోపిక్‌గా తెరకెక్కుతున్న తలైవి (జయ లలిత) బయోగ్రాఫికల్‌ మూవీకి కథ అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కంగనా జయ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా విడుదల కానుంది. Also Read: తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ మరో వివాదాస్పద కథకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా నలిగిన అయోధ్య రామమందిర విషయంలో ఇటీవల తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బిన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ అంశంపై విజయేంద్ర ప్రసాద్‌ ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ కథకు అపరాజిత అయోధ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నాస్తికురాలైన ఓ అమ్మాయి అయోధ్య నేపథ్యంలో పరమ భక్తురాలిగా మారే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కంగనా రనౌత్‌ నిర్మించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి టైటిల్ రోల్‌లోనూ తానే నటిస్తుందేమో చూడాలి. ఈ సినిమాతో పాటు కంగనా బయోపిక్‌ కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నారు. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ