నటుడు సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నటుడు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంపూర్ణేశ్ బాబు తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి వచ్చి సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు సాయం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. Also Read:
Comments
Post a Comment