BJPలో చేరిన సీనియర్ నటుడు.. షాకైన చిన్మయి శ్రీపాద

నటి రాధిక సోదరుడు, సినీ నటుడు రాధా రవి బీజేపీలో చేరారట. ఈ విషాయన్ని ఆయన స్నేహితుడు శేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఫొటోను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద్ ట్వీట్ చేస్తూ.. ‘నమ్మలేకపోతున్నాను. నిజంగానా’ అంటూ షాకయ్యారు. ఎందుకంటే.. రాధారవి కొన్ని నెలల క్రితం లేడీ సూపర్‌స్టా్ర్ అయిన నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నయనతార నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు రాధారవి గెస్ట్‌గా వెళ్లారు. ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదన్న విషయం తెలిసిందే. తాను పెట్టుకున్న రూల్ ప్రకారం ఆడియో లాంచ్ వేడుకకు కూడా నయన్ వెళ్లలేదు. ఈ విషయం గురించి రాధా రవి స్పందిస్తూ.. “నయనతారతమిళ సినిమాల్లో దెయ్యంగా, తెలుగు సినిమాల్లో సీతాదేవిగా నటిస్తుంది. మా రోజుల్లే సీతాదేవి లాంటి దేవత పాత్రలకు కేఆర్ విజయను ఎంచుకొనేవాళ్లం. ఇవాళ సీతగా ఎవరైనా నటించేయవచ్చు. మర్యాద మన్ననలు పొందేవాళ్లనూ ఆ పాత్రకు తీసుకోవచ్చు, పడుకొనేవాళ్లనూ తీసుకోవచ్చు” అంటూ నయనతార వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిలో మాట్లాడాడు. రాధారవి చేసిన ఈ వ్యాఖ్యల్ని వెంటనే ఏ పేరుపొందిన నటుడు కానీ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ ఖండించే సాహసం చెయ్యలేకపోయారు. ఇదివరకు ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొన్నందుకు డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని నిషేధించింది కూడా రాధా రవే. నయనతారపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని మొట్ట మొదటగా ఖండించింది చిన్మయి కావడం గమనార్హం. “ఇతర యూనియన్ల విషయంలో తలదూర్చమని అప్పట్లో నా విషయంలో నిర్మాతల మండలి, నడిగర్ సంగం మౌనం పాటించాయి. ఇప్పుడు ఒక పేరుపొందిన నటిని ఆ మనిషి బహిరంగంగా అవమానించాడు. ఇప్పుడు అవి చర్యలు తీసుకుంటాయా? తీసుకునేట్లయితే చాలా చాలా కృతజ్ఞతలు” అని ఆమె ట్వీట్ చేశారు. అలాంటి రాధా రవిని బీజేపీ తమ పార్టీలోకి ఎలా ఆహ్వానించింది అని చిన్మయి పరోక్షంగా ప్రశ్నించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ