రామ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్.. ఇదిగో ఫస్ట్‌లుక్

సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని దీపావళి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్నట్టుగానే ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ను, హీరో రామ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘రెడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రామ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిల్ మాదిరిగానే పోస్టర్‌లో రామ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ‘‘దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి సో బ్లడీ డిఫరెంట్’’ అని రామ్ తన ట్వీట్‌కు క్యాప్షన్‌గా పెట్టారంటే సినిమా ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్ - తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. కాగా, పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తుండటం విశేషం.
Comments
Post a Comment