రాములమ్మ కాంటెస్ట్: శ్రీముఖితో డ్యాన్స్ చేసే అవకాశం.. ఓట్ల కోసం ఇదో రకం ప్రచారం

‘బిగ్ బాస్’ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌లలో విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. ఈ ఐదుగురిలో రూ.50 లక్షలు సొంతం చేసుకోబోయేది ఎవరు అనే విషయంలో ‘బిగ్ బాస్’ షో అభిమానులకు విపరీతమైన ఎగ్జయిట్‌మెంట్ ఉంది. అయితే, విజేతగా నిలిచేది శ్రీముఖినే అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే శ్రీముఖి టీం కూడా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి అధికారిక ఖాతాల నుంచే ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ విపరీతంగా ప్రచారం చేస్తు్న్నారు. ఈ ప్రచారంలో భాగంగా ‘రాములమ్మ కాంటెస్ట్’ను కూడా ప్రవేశపెట్టారు. ఇంతకీ ఏంటీ ఈ రాములమ్మ కాంటెస్ట్.. అక్కడికే వస్తు్న్నా. శ్రీముఖిని బుల్లితెర రాములమ్మ అని అంటారని అందరికీ తెలిసిందే. అంతేకాదు ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలోని పాట వచ్చినప్పుడు శ్రీముఖి ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా వేస్తుంటుంది. ఇప్పుడు అదే స్టెప్పుతో ‘రాములమ్మ కాంటెస్ట్’ను నిర్వహిస్తున్నారు. Also Read: ఈ కాంటెస్ట్‌లో భాగంగా ఆసక్తిగల అమ్మాయిలు, అబ్బాయిలు రాములమ్మ సిగ్నేచర్ స్టెప్‌తో ఒక వీడియో చేసి #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇలా పోస్ట్ చేసిన వీడియోల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. ఆ వీడియో చేసినవారికి శ్రీముఖితో డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తారు. ఆ సిగ్నేచర్ స్టెప్ ఎలా చేయాలో తెలియజేయడానికి శ్రీముఖి కొంత మంది పిల్లలతో కలిసి చేసిన వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు శ్రీముఖి అభిమానులైతే ఇప్పుడే మొదలుపెట్టండి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ