మహేష్ దివాళి గిఫ్ట్.. బుల్లెట్‌పై ‘సరిలేరు నీకెవ్వరు’

దీపావళి పండుగ వేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నుండి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు బుల్లెట్‌పై కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ అన్నట్టుగానే ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోండగా.. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో రెండు దశాబ్ధాల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో విజయశాంతి భారతిగా కనిపించబోతున్నారు. మొత్తంగా దీపావళి కానుకగా.. విజయ శాంతి లుక్‌తో పాటు, మహేష్ లేటెస్ట్ పోస్టర్‌ను విడుదల చేసి డబుల్ ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా.. అదితీ రావు హైదరీ సెకండ్ హీరోయిన్‌గా నటించింది.
Comments
Post a Comment