‘Ram Charan.. లవ్యూ రా లవ్యూ రా..’

‘ఈ అడవి నాదే వేటా నాదే’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజవి తనయుడు రామ్ చరణ్. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’. తొలి సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా విడుదలైన నేటికి 12 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ‘లవ్యూ రా లవ్యూ రా నా మనసంతా నువ్వేరా’ అనే పాట గుర్తుందా. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. చరణ్ కోసం ఆయన రాసిన మొదటి పాట ఇదేనని ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ను కూడా పాటతోనే మొదలుపెట్టినట్లు తెలిపారు. చిరంజీవి కొడుకు కావడంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రామ్ చరణ్ కెరీర్‌ విజయవంతంగా సాగేలా చేసింది. చిరు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వారిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కుమారుడే ఎంట్రీ ఇస్తున్నాడంటే హైప్ ఎంతుంటుందో ఆలోచించండి. అందుకే సినిమా ఆడకపోయినా ఫర్వాలేదు కానీ తన తండ్రి స్థాయికి మాత్రం ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకూడదని చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తొలి చిత్రంతోనే చిరు కొడుకా మజాకా అనిపించాడు. చిరుత సినిమాకు వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ సహాయ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ రేట్‌ను చూసి బెంగాలీలో ‘రంగ్‌బాజ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. సినిమా కాన్సెప్ట్ ఒక ఎత్తైతే.. ఇందులో పాటలు మరో ఎత్తు. పాటలకు చాలా మంది స్పందన వచ్చింది. పాటలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్‌స్టార్ ట్యాగ్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన చివరగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో చరణ్ బిజీగా ఉన్నారు. దీంతో పాటు తన తండ్రి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాణ పనులను కూడా చూసుకుంటున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ