Comedian Venu Madhav: వేణు మాధవ్ చివరి కోరిక తీర్చిన హైపర్ ఆది

నవ్వుల ‘వేణు’వు అంత్యక్రియలకు ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది. 23 ఏళ్లుగా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఇండస్ట్రీ ప్రముఖులు, తోటి నటులు వేణు మాధవ్‌కి కన్నీటి వీడ్కోలు పలికారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వేణుని తలచుకుని ఇండస్ట్రీకి చెందిన హాస్య నటులు కన్నీరుమున్నీరయ్యారు. బజర్దస్త్ కమెడియన్ వేణు మాధవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ‘వేణు మాధవ్ అన్న మాకు ఎప్పటి నుండో పరిచయం. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే కమెడియన్స్‌కి ఆయనే ఇన్స్‌పిరేషన్. జబర్దస్త్‌ స్కిట్‌లను చూసి ఫోన్ చేసి మరీ మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆయన చనిపోవడానికి నాలుగురోజుల ముందు నాకు ఫోన్ చేసి జబర్దస్త్‌లో వాళ్ల చుట్టాల అబ్బాయికి అవకాశం ఇవ్వమని సాయం కోరారు. నేను ఓ స్కిట్‌లో ఆయన చెప్పిన అబ్బాయిని పెట్టడం జరిగింది. అదే ఆయన నన్ను అడిగిన చివరి కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తులకే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఆయన ఎంతో సాయం చేశారు. ఆపద వచ్చిందంటే ముందుకు వచ్చి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు హైపర్ ఆది. జబర్దస్త్ కమెడియన్ దొరబాబు మాట్లాడుతూ.. ‘నేను కమెడియన్‌ కావడానికి ప్రేరణ వేణు మాధవ్ అన్న. ఆయన యాక్టింగ్ చూసి నేను సినిమాల్లోకి రావాలని కోరుకున్నా. మా జబర్దస్త్‌లో హైపర్ ఆది టీం అంటే వేణు అన్నకు చాలా ఇష్టం. మమల్ని ఎంతో అభిమానించే వారు. ఆయన చాలా సార్లు మా సెట్‌కి వచ్చేవారు. అందర్నీ నవ్వించేవారు. ఆయన నవ్వుల్ని మేం కోల్పోయాం’ అంటూ ఎమోషన్ అయ్యారు దొరబాబు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ