Chanakya: 'చాణక్య' ట్రైలర్: 'రా'ఏజెంట్‌కి బ్యాంక్ ఎంప్లాయ్‌కి ఏంటి సంబంధం?

హీరోగా, హీరోయిన్‌గా తమిళ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా . ఈ సినిమా అక్టోబర్ 5కి రిలీజ్ అవుతుండడంతో సినిమా యూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఆట్రైలర్‌ని ముందుగా ఒక చిన్న యాక్షన్ మోడ్‌లో ఓపెన్ చేసారు. కానీ ఆ తరువాత మాత్రం అతన్ని ఒక బ్యాంకు ఎంప్లాయిగా చూపించారు. అక్కడే మెహ్రీన్ క్యారెక్టర్‌ని కూడా తీసుకొచ్చి కాస్త కామెడీగా అలా అలా నడించింది వ్యవహారం. అయితే రా ఆఫీసర్ అర్జున్ శ్రీకర్‌కి, బ్యాంకు ఏజెంట్ రామకృష్ణకి ఉన్న సంబంధం ఏంటి అనేది ట్రైలర్‌లో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమాకి కూడా అదే కీలకం కావచ్చు. Also Read: ఇక ఈ సినిమా ఎక్కువభాగం పాకిస్థాన్‌లో జరుగుతున్నట్టు చూపించారు. దానివల్ల అక్కడక్కడా గోపీచంద్ హీరోగా నటించిన సాహసం సినిమా ఛాయలు కనిపించాయి. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్‌ని స్టైలిష్‌గా చూపించడానికి ట్రై చేసాడు. అలాగే లావిష్ యాక్షన్ ఎంటెర్టైనెర్ ఈ సినిమాని తెరకెక్కించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విషయం ఈ ట్రైలర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక పక్క పాక్‌లో ఆపరేషన్ కోసం వెళ్లిన మన రా ఏజెంట్‌ని మనవాళ్ళే కనిపిస్తే కాల్చెయ్యమని ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఎదో ఒక ట్విస్ట్ కోసం పెట్టుకున్న పాయింట్ లా ఉంది. హీరోయిన్ మెహ్రీన్‌కి మాత్రం సాదాసీదా పాత్ర దక్కినట్టు కనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్స్‌కి మాత్రమే ఆమెని వాడుకుని ఉంటారు. ఎందుకంటే ట్రైలర్ ఆమెకి అంతకి మించి స్కోప్ ఉంది అనేలా ఏమీ చూపించలేదు. Also Read: గోపీచంద్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నిటిలో ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టారు అని చెబుతున్నారు.ఆ ఖర్చు ట్రైలర్ లో కనిపిస్తుంది. అబ్బూరి రవి డైలాగ్స్ బాగానే పేలాయి. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ పాటలకు కంపోజ్ చేసాడు. ఇక నేపధ్య సంగీతం మాత్రం ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్న శ్రీచరణ్ పాకాల సమకూర్చాడు. సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ని పెంచే విధంగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేని చాణక్య సినిమాపై ఈ ట్రైలర్‌తో మంచి బజ్ తీసుకొచ్చాడు ఆ సినిమా డైరెక్టర్ తిరు. ఈ ట్రైలర్‌లో కూడా ఈ సినిమాని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ స్పై థ్రిల్లర్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.
Comments
Post a Comment