‘సైరా’లో చిరంజీవికి డబ్బింగ్ చెప్పింది ‘చాణక్య’ విలన్!

మాచో హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్ రాజేష్ ఖట్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ‘చాణక్య’లో ఖురేషి పాత్రలో ఆయన నటించారు. ఇది విలన్ పాత్ర. ఇంత మంచి సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఖట్టర్ అంటున్నారు. అయితే, అంతకన్నా ఆయనకు ఆనందమైన విషయం ఇంకోటి ఉంది. అదే, మెగాస్టార్ చిరంజీవికి హిందీలో డబ్బింగ్ చెప్పడం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు గడ్డపై ఆంగ్లేయులపై కత్తెత్తిన తొలి పోరాట యోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. నయనతార, తమన్నా ప్రధాన నటీమణులు. అలాగే అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రల్లో నటించారు. Also Read: సుమారు రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ‘సైరా’.. తెలుగు సహా ఐదు భాషల్లో అక్టోబర్ 2న బ్రహ్మాండంగా విడుదలవుతోంది. అయితే, హిందీలో మెగాస్టార్ చిరంజీవికి రాజేష్ ఖట్టర్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని ‘చాణక్య’ దర్శకుడు తిరు.. ఆదివారం రాత్రి వైజాగ్‌లో జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు. వాస్తవానికి రాజేష్ ఖట్టర్ వాయిస్ చాలా బాగుంటుంది. ‘సైరా’ హిందీ ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాకపోతే, ఆ డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలీదు. తిరు పుణ్యమా అని ఆ విషయం తెలిసిపోయింది. ఖట్టర్ ‘చాణక్య’ సినిమాలో విలన్‌గా నటించడం కన్నా చిరంజీవి డబ్బింగ్ చెప్పారనే విషయంతోనే బాగా పాపులర్ అవుతున్నారు. కాగా, ‘చాణక్య’ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ