ఒకే ఫ్రేమ్‌లో చిరు, అమితాబ్.. బాలీవుడ్ సైతం ఫిదా

ఈ ఏడాది టాలీవుడ్ నుండి రాబోతున్న మరొక భారీ బడ్జెట్ మూవీ సైరాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 270 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమా స్పాన్‌కి తగ్గ ప్రచారం ఇంతవరకు జరగలేదు. అయితే ఇన్ని రోజులు చేసిన ప్రచారం వేరు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు చేసే ప్రచారం వేరు. అందుకే 64 సంవత్సరాల వయసులోనూ అలుపెరగకుండా, వెనకడుగు వెయ్యకుండా ఈ సినిమా కోసం కష్టపడిన ఇప్పుడు ప్రమోషన్స్‌లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. Also Read: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాని హిందీలో ఫరాన్ అఖ్తర్ రిలీజ్ చేస్తున్నాడు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే భారీ ఓపెనింగ్స్ రావాలంటే ఈ హైప్ సరిపోదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాలో చిరంజీవి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించిన అమితాబ్ కూడా రంగంలోకి దిగారు. అమితాబ్ వల్లే ఈ సినిమాకి అక్కడ అంత భారీ రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పటివరకు బిగ్ బి ఈ సినిమాకి సంబంధించి ఏ ఈవెంట్‌లో కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సైరా కోసం రంగంలోకి దిగారు. ఒక్క ఫోన్ కాల్‌తో చిరంజీవి మాటకు గౌరవం ఇచ్చి ఈ సినిమాలో నటించిన అమితాబ్ ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఈ సినిమాని ప్రొమోట్ చెయ్యడానికి ముందుకు వచ్చారు. Also Read: అమితాబ్ మీడియా ముందుకు రావడంతో బాలీవుడ్‌లో ఓపెనింగ్స్ వరకు ఢోకా ఉండదు అని కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్న ఫరాన్ అఖ్తర్ కూడా నటుడు కావడం, అక్కడ అతనికి కూడా బాగా గుర్తింపు ఉండడంతో అతను కూడా చిరు, అమితాబ్‌లతో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అయిన అమితాబ్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రమోషన్స్ చేస్తేనే రెస్పాన్స్ ఇలా ఉంటే రేపు సినిమాలో వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఏ రేంజ్‌లో పేలతాయో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పటివరకు కామ్‌గా ఉన్న సైరా టీమ్ సమయం వచ్చేసరికి మాత్రం గట్టిగానే గర్జిస్తుంది. ఈ సినిమాకి కాస్త హిట్ టాక్ వచ్చినా ఆ తరువాత కలెక్షన్స్ సునామి కూడా అంతా ఆశ్చర్యపోయే రేంజ్‌లోనే ఉంటుంది. మెగాస్టార్ కూడా పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడు. Also Read:
Comments
Post a Comment