'సైరా'పై అల్లు అర్జున్ స్పందన.. బన్నీ మనసులో ఇంతుందా?

సినిమాపై అందరికి భారీ అంచనాలున్నాయి. అంతేకాదు బాహుబలి తరువాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆ రేంజ్‌లో సంచలనం సృష్టించబోతోంది అన్న ఆనందం ప్రతిఒక్కరిలో ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్ గుంరించి బన్నీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదైనా చిన్న సినిమా విజయం సాధిస్తేనే బేషజానికి పోకుండా ఆ సినిమాని సోషల్ మీడియాలో పొగిడి దానికి మైలేజ్ తెచ్చే బన్నీ అంత పెద్ద సినిమా, అంతా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న సినిమా, స్వయానా సొంత మేనమామ అయిన సినిమా గురించి కనీసం కూడా స్పందించకపోవడంతో అంతా బన్నీని ఏకేస్తున్నారు. అలానే సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రానందుకు కూడా బన్నీని ట్రోల్ చేస్తున్నారు. Also Read: అప్పుడు సైలెంట్‌గా ఉన్న బన్నీ ఇప్పుడు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్‌లో సైరా గురించి ఒక సుదీర్ఘమయిన పోస్ట్ పెట్టాడు.' సైరా నరసింహారెడ్డి..మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక మాగ్నమ్ ఓపస్ ఇది. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. చాలా సంవత్సరాల క్రితం నేను మగధీర సినిమా చూసినప్పుడు ఎప్పుడోఅప్పడు చిరంజీవిగారిని కూడా అలాంటి ఒక గ్రాండ్ ఎపిక్ సినిమాలో చూడాలి అనుకున్నాను. ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి గారితో ఇలాంటి ఎపిక్ సినిమా తీసినందుకు ఈ సినిమా ప్రొడ్యూసర్ మరియు నా సోదరుడు అయిన రామ్ చరణ్‌కి థాంక్స్ చెబుతూ అభినందిస్తున్నాను. ఒక తండ్రికి ఒక కొడుకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఇదే. కన్న తండ్రి ఘనవారసత్వానికి అసలయిన నివాళి. ఈ సినిమాకి పని చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా బెస్ట్ విషెస్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా గౌరవం తెలుపుతున్నాను. ఈ సినిమా మన గుండెలపై ఎప్పటికి నిలిచిపోయే ఒక మ్యాజిక్ క్రియేట్ చెయ్యాలని, ఆ సినిమా పేరు మన గుండెల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నా' అంటూ సుదీర్ఘంగా సైరా సినిమాకి విషెస్ చెప్పాడు. బన్నీ రాసిన లేఖలో ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పుడు సైరా ని విస్మరించడానికి, ఇప్పుడు రిలీజ్ ముందు మళ్ళీ ఇలా ఇంత రేంజ్‌లో పొగడడానికి కారణం ఏంటి?. బన్నీ తాను చేసింది తప్పు అని తానే రియలైజ్ అయ్యాడా? లేక ఎవరయినా చెబితే ఇలా స్పందించాడా? అనే విషయంపై ఇంకా రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఈ సినిమాని పక్కనబెడితే నటిస్తున్న అల..వైకుంఠపురములో సినిమాకి కూడా నెగెటివిటీ వస్తుంది అని ఇలా రియాక్ట్ అయ్యాడా? అని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎంతయినా ఒకే కుటుంబం, పైగా తాను నటుడు అవ్వడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన మేనమామ సినిమా ...పొగడకుండా ఎందుకుంటాడు. కాకపోతే బన్నీ ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చిరంజీవి చరణ్ గురించి,ఈ సినిమా గురించి చెప్పినమాటల్లాగా ఉండడం కొసమెరుపు. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ