ALAVAIKUNTAPURAMULO: అల..వైకుంఠపురములో..అదిరే మెలోడీ

ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది బన్నీకి. 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' ఫెయిల్యూర్‌తో పాటు ఆ సినిమా అనంతరం కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. దాంతో మిగతా హీరోలతో పోలిస్తే మార్కెట్ పరంగా, హిట్స్ పరంగా కూడా బాగా వెనుకబడ్డాడు. దీంతో ఇప్పుడు అల..వైకుంఠపురములో సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది. అందుకే అక్కడ ఉన్నది మాటల మాంత్రికుడు అయినా కూడా బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తయ్యేవరకు సెట్స్‌కి వెళ్ళలేదు. Also Read: అల..వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పటినుండి ఆ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ అండ్ చిన్న టీజర్ రాగా ఇప్పుడు మాత్రం ఫుల్ ప్లెడ్జెడ్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాకోసం థమన్ కంపోజ్ చేసిన ఒక అద్భుతమైన మెలోడీలోని ఒక రెండు లైన్స్‌ని శాంపిల్‌గా వదిలారు. సీతారామశాస్త్రి రాసిన ఈ పాటలోని మీనింగ్ ఫుల్ లిరిక్స్‌కి సిద్ శ్రీరామ్ వాయిస్‌లోని మ్యాజిక్ కూడా కలగలిసి అద్భుతహా అనిపించింది. కేవలం శాంపిల్ ఈ రకంగా ఉంటే పూర్తి పాట ఇంకే లెవెల్‌లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. Also Read: 'సామజవరగనమన' అనేది ఈపాట హుక్ లైన్ కమ్ టైటిల్. కానీ ఆ రెండు లేకుండానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత ఫ్రెష్‌గా ఉంది ఈ మెలోడీ. థమన్ ఈ సినిమాకి సూపర్ కూల్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడు అని అర్ధమైపోయింది. అలాగే ఈ సినిమా కూడా త్రివిక్రమ్ గత సినిమా అరవింద సమేతలా వైలెన్స్‌తో కాకుండా కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుంది అని ఈ చిన్న ప్రమోషనల్ మెటీరియల్‌తో పూర్తిగా హింట్ ఇచ్చారు. బన్నీ గత సినిమాలో మిస్ అయిపోయిన కామెడీని మళ్ళీ ఈ సినిమాలో ఫుల్ ప్లెడ్జెడ్‌గా పండించబోతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ మార్క్ నవ్వుల విందు రెడీ అన్నమాట Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ