పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్‌కి ముందు రూ. 50 వేలు కూడా లేవు

నేడు (సెప్టెంబర్ 28) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హీరోయిన్ . ఈ సందర్భంగా.. ఇండస్ట్రీలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్ధికసాయం అందించారు చార్మి. ఈ పుట్టిన రోజు వేడుకలో ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు చార్మి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెమెరా ముందు నటించడానికి, స్టేజ్‌ మీద మాట్లాడటానికి పెద్దగా భయపడను. కాని ఈరోజు ఎందుకో ఏం మాట్లాడాలి? దేనిపై మాట్లాడాలని టెన్షన్‌గా ఉంది. అప్పట్లో దాసరి గారు చెప్పారు.. పూరీ జగన్నాథ్ నా వారసుడు అని. ఆ మాట విన్న పూరీ గారు నా దగ్గర చాలా ఎమోషన్ అయ్యారు. ఆరోజు నా మనసులో అనిపించింది.. దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని. Read Also: పూరీ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న నేను.. ఆయనకు ఏం కావాలో అది ఇవ్వడమేనా? సినిమాలు తీయడమేనా? హిట్లు కొట్టడమేనా? అనే ఆలోచన వచ్చినప్పుడు అయితే మా దగ్గర డబ్బులు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి పూరీ నేను ఫైనాన్సియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడూ మేం ఎవరివద్ద డిస్కస్ చేయలేదు. ఎవరి సాయం కోరలేదు. ఆ టైంలో మా దగ్గర కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో ఒకరికి ఒకరం బలంగా నిలబడ్డాం. ఆ టైంలో పూరీ గారు.. నాకు ఒక మాట చెప్పారు. ‘రేయ్.. ఈరోజు మన దగ్గర డబ్బుల్లేవు చాలా కష్టాల్లో ఉన్నాం. కాని.. ముందు మనం మన హెల్త్‌ని బాగా చూసుకుందాం. నేను హెల్త్‌ని చూసుకుంటూ కథలు రాస్తా. నువ్ ఎక్కడ ఏ సినిమా చేయాలని మనం ప్లాన్ చేద్దాం. ఏమీ కాదు.. ఆస్తులు వస్తాయి పోతాయి. మనం స్ట్రాంగ్‌‌గా ఉందాం అని చెప్పారు. కాని ఇస్మార్ట్ శంకర్‌ సెట్ కావడానికి చాలా టైం పట్టింది. హీరో రామ్.. రియల్ లైఫ్‌ హీరో అనిపించారు. పూరీ గారి కథ చెప్పినప్పుడు ఎలాంటి డౌట్‌లు లేకుండా ఆయన్ని నమ్మారు. మేం కష్టాల్లో ఉన్నామా? మాకు హిట్లు ఉన్నాయా? ఫ్లాప్‌లు ఉన్నాయా? ఇలాంటివేం చర్చించకుండా ఆయన పూరీతో చేయాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఓకే చేశారు. మనస్పూర్తిగా చెబుతున్నా.. సాయం చేసే గుణం అతనిలో చూశా. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ఆయన మళ్లీ హిట్ అందుకున్నారు. ఆయన సత్తా ఏంటో అందరికీ తెలిసింది. పూరీ కోసం నాకు ఒక మెసేజ్ పంపించారు.. అందులో ఆయన.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అని చెప్పారు. ఈ విషయాన్ని మీకు చెప్పమన్నారంటూ పూరీ సందేశాన్ని అందించింది చార్మి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ