Saaho Intro Scene: ప్రభాస్ ఇంట్రో సీన్ లీక్.. సిక్స్ ప్యాక్‌లో గూస్‌బమ్స్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని రెండేళ్లుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ప్రభాస్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘సాహో’ విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. Read Also: బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్‌లో మరింత హైప్ తీసుకువచ్చారు. ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌కి యువ దర్శకుడు సుజీత్ హాలీవుడ్ రేంజ్ టేకింగ్ సినిమా స్థాయిని పెంచింది. Read Also: విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ‘సాహో’.. దుబాయ్‌లో ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్లు. కొంత మంది సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉందని.. మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్.. ‘సాహో’లో ప్రభాస్ ఇంట్రో సీన్‌ని షూట్ చేసి రోమాలు నిక్కబొడుచుకునేట్టుగా ఆయన ఎంట్రీ ఉందంటూ ఆ వీడియో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘సాహో’ లోని ప్రభాస్ ఇంట్రో సీన్ వైరల్ అవుతోంది. సిక్స్ ప్యాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ అదరహో అనిపించేట్టుగానే ఉంది. ప్రభాస్ ఇంట్రో సీన్..
Comments
Post a Comment