Saaho Collections: ‘సాహో’ ఫస్ట్ డే వంద కోట్లు.. ప్రభాస్ వరుస రికార్డ్!

టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ తొలిరోజు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా శుక్రవారం నాడు భారీగా విడుదలైన ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా ‘సాహో’ మూవీ తొలి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రభాస్ కెరియర్‌లో వరుసగా రెండోసారి వందకోట్లు సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ కూడా తొలి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ వరస చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ఏరియాలవారిగా ఈ కలెక్షన్ల రిపోర్ట్ ఇలా ఉంది... నైజాం: 14. 1 కోట్లు ఆంధ్రప్రదేశ్: 42. 2 కోట్లు కర్ణాటక: 13. 9 కోట్లు తమిళనాడు: 3. 8 కోట్లు కేరళ: 1.2 కోట్లు హిందీ (బాలీవుడ్): 29.6 కోట్లు టోటల్ ఇండియా గ్రాస్ 104.8 కోట్లు టోటల్ ఇండియా షేర్ 68. 1 కోట్లు కాగా.. హిందీలో 29.6 కోట్లు షేర్ సాధించి 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సాహో’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు నైజాం ఏరియాలో బాహుబలి రికార్డ్‌ను బీట్ చేసింది ‘సాహో’. ఫస్ట్ డే నైజాంలో రూ. 14. 1 కోట్లు సాధించిన చిత్రంగా ‘సాహో’ తొలిస్థానంలో నిలిచింది. మరి ఇదే ఊపును వీకెండ్‌లో కొనసాగితే ‘సాహో’ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమే.
Comments
Post a Comment