Q నెట్ కుంభకోణం: సినీ ప్రముఖులకు బిగుస్తున్న ఉచ్చు.. మరోసారి నోటీసులు

క్యూనెట్ కేసులో సినీ సెలబ్రిటీలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విచారణను విచారణ వేగవంతం చేసిన సైబరాబాద్ పోలీసులు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులకు మరోసారి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న వారిలో షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, అనిల్ కపూర్ తదితరులు ఉన్నారు. సంచలనం సృష్టించిన క్యూనెట్ కేసులో పోలీసులు ఇప్పటికే ఒకసారి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. ఈ నోటీసులకు కొంత మంది నటీనటులకు స్పందించకపోగా.. మరి కొంత మంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు పంపించారు. టాలీవుడ్ స్టార్లు అట్లు శిరీష్, పూజాహెగ్డే కూడా నోటీసులకు వివరణ ఇవ్వనట్లు తెలుస్తోంది. క్యూనెట్‌ను ప్రమోట్ చేసినందుకు గాను సినీ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐపీసీ 420, 406,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టవద్దంటూ కేంద్రం ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యూనెట్ వ్యవహారంలో ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి, 70 మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. క్యూనెట్ కేసులో పురోగతిని మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. బెంగళూరులోని విహాన్ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. క్యూనెట్ సంస్థ రెండు అవతారాలతో ప్రజలను మోసగించిందని.. ఇప్పటి వరకు రూ.5 వేల కోట్ల మేర మోసం జరిగిందని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా జరిగింది. ఈ స్కాం బాధితులు లక్షల్లో ఉన్నారు. ఈ సంస్థ నిరుద్యోగులను కూడా మోసం చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదు చేశారు. క్యూనెట్ కుంభకోణం గురించి.. ‘క్యూనెట్’ అనేది మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో చేసిన ఓ భారీ కుంభకోణం. ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ సంస్థకు అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో సినీ రంగ ప్రముఖులు బొమన్ ఇరానీ, షారుక్ ఖాన్, అల్లు శిరీష్, పూజా హెగ్డే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్, క్యూనెట్ కంపెనీ సీఈవోలు, డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, క్రికెటర్లు దాదాపు 300 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
Comments
Post a Comment