Payal Rajput: అవకాశాల కోసం సెక్స్ చేసే టైప్ కాదు

టాలీవుడ్‌లో పాయల్ హాట్ కేక్‌లా మారిపోయారు. తొలి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తోనే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆమెను వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఆమె నటిస్తున్న ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ మోతాదును మరింత పెంచేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా పాయల్ క్యాస్టింగ్ కౌచ్, మీటూ గురించి మాట్లాడారు. ‘ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదలయ్యాక ఓ నిర్మాత పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కోరిక తీర్చమన్నాడు. కానీ నేను ఈ సెక్సువల్ ఫేవర్స్‌కు పూర్తి వ్యతిరేకిని. అందుకే వీటిని ఎప్పుడూ ఖండిస్తుంటాను. చెప్పాలంటే నేను పంజాబ్, ముంబయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మున్ముందు కూడా ఎదురవుతుంటాయని అనుకుంటున్నాను. మీటూ ఉద్యమానికి తెరలేచినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే నాకు వీటి గురించి మాట్లాడే ధైర్యం ఉంది. ‘ఆర్ ఎక్స్ 100’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం వేరొకరితో సెక్స్‌కి ఒప్పుకొంటానని కాదు’ అని వెల్లడించారు. ‘ఆర్ డీ ఎక్స్ లవ్’తో పాటు పాయల్ ‘వెంకీ మామ’ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు. అయితే పాయల్ నటించిన ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ ట్రైలర్‌పై పలువురి నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండొచ్చు కానీ మరీ సెక్స్ సినిమాలా తీయకూడదని విమర్శలు వస్తున్నాయి.
Comments
Post a Comment