ఆత్మహత్య చేసుకున్న నటి

సినిమాల్లో నటించేందుకు ముంబయికి వచ్చిన పర్ల్ పంజాబీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఏదీ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. అందులోనూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం అర్థరాత్రి ముంబయిలోని ఓషివారా ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురించి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ.. ‘గురువారం అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాకు రోడ్డుపై ఎవరో అరుస్తున్నట్లుగా అనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయి. నేను పైకి వెళ్లేసరికి ఆ యువతి దూకేశారు’ అని తెలిపారు. పర్ల్ పంజాబీ మెంటల్‌గా డిస్టర్బ్ అయివున్నారని తరచూ ఆమె తన తల్లితో గొడవ పడుతండేవారని పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండు మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడితే సకాలంలో హాస్పిటల్‌కు తరలించడం వల్ల బతికారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment