‘మీకు మాత్రమే చెప్తా’.. ఫస్ట్‌లుక్ ఇదిగో..

రౌడీ బాయ్ తాను నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేశారు. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లుక్‌లో తరుణ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ పట్టుకుని ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంది. పోస్టర్ పైన ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్’ అని రాసుంది. అంటే వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా ఫన్నీగా ఉండబోతోందేమోనని తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ హీరోగానే కాకుండా ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా విజయం సాధించేలా ఉన్నాడు. సినిమా టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశారు దేవరకొండ. ఇక సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పనవసరం లేదు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం లేదని తెలుస్తోంది. బహుశా ఆయన అతిథి పాత్రలో కనిపించవచ్చని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తాము నిర్మించే సినిమాల్లో తామే నటిస్తున్నారు. మరి విజయ్ ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతారా... లేక కేవలం పెట్టుబడి మాత్రమే పెడతారా అన్నది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.
Comments
Post a Comment