కన్నడ నటుడిని చితకబాదిన జనం

కన్నడ నటుడు వివాదాస్పదంలో చిక్కుకున్నారు. గురువారం కర్ణాటకలోని నాపోక్లు ప్రదేశంలో ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కేఎస్‌ఆర్టీసీ ఎదుట నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు నిలదీశారు. మాట వినకపోయేసరికి పట్టుకుని చితకబాదారు. విషయం తెలిసి స్థానిక మీడియా వర్గాలు అక్కడి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆయన ఎందుకు అలా ప్రవర్తించారన్న విషయం తెలియరాలేదు. ఒకవేళ తాగి అలా ప్రవర్తించారా.. లేక సదరు కారు యజమానితో వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్పీ కొడాగు తెలిపారు.
Comments
Post a Comment