YS Jagan: జగన్‌ని అడుక్కోను.. పృథ్వీ తప్పు చేశాడు: పోసాని పరోక్ష విసుర్లు

ఇండస్ట్రీ తరుపున తొలి నుండి జగన్ వెంట నడిచారు పోసాని. ఎలక్షన్స్ సమయంలోనూ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన.. నామినేట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కావడంతో రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. వాటిపై స్పందిస్తూ బుధవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఇండస్ట్రీలోనో.. రాజకీయాల్లోనో నేను చేయాల్సిన పనులు మిగిలి ఉండటం వల్లే తిరిగి బతకగలిగానని లేదంటే చనిపోయి ఉండే వాడినన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత . తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వరుస కథనాలపై స్పందిస్తూ.. బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను. నాకు జరిగిన తొలి ఆపరేషన్ ఫెయిల్ కావడంతో పొట్టలో ఇన్‌ఫెక్షన్ వచ్చి చావు వరకూ వెళ్లా.. నా చీటీ చినిగిపోద్ది అనుకున్నా. అయితే డాక్టర్ల కృషితో బతికి బట్టకట్టా. అంతే తప్ప ఇతరత్రా రోగాలేం నాకు లేవు. అన్నం లేకుండా చాలా రోజులు బెడ్ మీదే ఉన్నా. యూరిన్‌కి పోవాలన్నా నా భార్య, అక్క ఎత్తుకుని తీసుకువెళ్లేవారు. అయితే రెండో సారి ఆపరేషన్ జరిగిన తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో డాక్టర్ ఎమ్.వి రావు నన్ను ఇంటికి పంపించారు. నేను ఈరోజు బతికానంటే ఆ డాక్టర్ వల్లే. 2011లో జగన్ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచారు. విజయమ్మ కూడా రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను, రోజా మాత్రమే మిగిలాము. అప్పుడు ఇండస్ట్రీ నుండి ఎవరూ ఆయన వెనుకరాలేదు. ఆయన వెంట పలు దీక్షల్లో పాల్గొన్నా. అప్పటి నుండి ఇప్పఏ: చేన్నా. తొమ్మిదేళ్లుగా ఆయనతో నడిచా. ఆయన పార్టీకి నా నుండి ఎంత చేయాలో అంత చేశా. అయితే ఎన్నికల్లో మీకు ఏం కావాలి? ఎంపీ కావాలా? ఎమ్మెల్యే కావాలా అని అడిగారు. నేను ఏం కావాలనుకోవడం లేదు. అది జగన్ గారి ఇష్టం. ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే. నాకు కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావడమే అన్నా. నేను అన్నట్టుగానే ఆయన గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన పదవి ఇస్తా అంటే.. తప్పకుండా చేస్తా. అందులో ఇగో ఏం లేదు. నేను ఇప్పటి వరకూ ఎవర్నీ ఏం అడుక్కోలేదు. నా మూతి మీద మీసం మొలిచాక.. సినిమా ఇండస్ట్రీలో కాని బయటకాని ఎవర్నీ వెళ్లి అడుక్కున్నది లేదు. అంతేతప్ప ఎగబడి నాకు పదవి కావాలని అడగను. మురళి చేయగలడు అని వాళ్లు నమ్మి నాకు ఏదైనా పదవి అప్పగిస్తే చేస్తా. నామినేట్ పదవులపై నాకు ఆశలేదు. పదవి కోసం నేను గుంటకాడ నక్కలా ఎదురుచూడటం లేదు. కొంతమంది పదవులు ఇష్టపడతారు. నాకు అంత ఇష్టం లేదు. నాకంటే జూనియర్స్‌కి పదవులు ఇచ్చారని నాకు కోపమేం లేదు. వాళ్లకి పదవి అంటే ఇష్టం. పైగా జూనియర్ అయినా ఎక్కువ కష్టపడినందుకు పదవులు ఇవ్వవచ్చు. వాళ్లు ఒంటి భుజంపై పార్టీని మోశారేమో. ఈరోజు నాకు పదవి ఎందుకు రాలేదంటే నేను అడగలేదు కాబట్టి. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని నటుడు పృథ్వీ అనడం తప్పు. పృథ్వీ అలా అనకూడదు. నేను సినిమా ఇండస్ట్రీలో 34 ఏళ్ల నుండి ఉంటున్నా. జగన్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఒక దండ వేసి అభినందిస్తే ఆయనపై ప్రేమ ఉన్నట్టు కాదు. సురేష్ బాబు ఫోన్ చేసి జగన్ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశారు. అది పృథ్వీకి తెలియకపోవచ్చు. ఇండస్ట్రీ తరుపున పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. క్రిష్ణ, క్రిష్ణంరాజు, చిరంజీవి లాంటి వాళ్లకు జగన్ గెలిస్తే నష్టం లేదు. ఈ విషయంలో పృథ్వీ నన్ను క్షమించాలి. మీరు తొందరపడి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని. మొత్తానికి తనకంటే వెనుక వైసీపీ పార్టీలో చేరి స్వీబీసీ ఛానెల్ చైర్మన్‌గా నామినేట్ పోస్ట్ సాధించిన 30 ఇయర్స్ పృథ్వీకి పరోక్షంగానే కౌంటర్ ఇచ్చారు పోసాని.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ