‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ‘RX 100’ హీరోయిన్.. ఒకేసారి రెండు సిగరెట్లు!

పాయల్ రాజ్‌పుత్.. ‘RX 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ తొలి చిత్రంతోనే చెరగని ముద్ర వేసింది. ప్రేమ పేరుతో అబ్బాయిని మోసం చేసి శారీరకంగా వాడుకునే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తరవాత పాయల్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘సీత’ సినిమాలో ‘బుల్‌రెడ్డి’ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ప్రస్తుతం ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన నటిస్తోంది. అలాగే, ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇంకోవైపు ‘ఆర్డీఎక్స్’ అనే చిన్న సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమాలతో బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకేసారి రెండు సిగరెట్లను లాగిపారేస్తోంది పాయల్. కళ్లకు బ్లాక్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని చేతిలో రెండు సిగరెట్లతో పొగ వదులుతూ పాయల్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ కిరాక్ లుక్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘ఇంకా కబీర్ సింగ్ / అర్జున్ రెడ్డి మోడ్‌లోనే ఉన్నా. ఇది షూటింగ్‌లో భాగంగా చేసింది. నా రాబోయే చిత్రంలో ఒక సన్నివేశం ఇది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’’ అని పాయల్ పేర్కొంది. రాబోయే చిత్రం అని చెప్పింది కానీ.. ఆ సినిమా పేరేమిటో పాయల్ చెప్పలేదు. వాస్తవానికి పాయల్‌ను స్మోకింగ్ లుక్‌లో చూడటం ఇది మొదటిసారి కాదు. ‘RX 100’ సినిమాలోనూ పాయల్ స్మోకింగ్ చేస్తూ కనిపించింది.
Comments
Post a Comment