పుల్లేటుకుర్రులో మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య గురువారం ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేయించారు. పుల్లేటికుర్రుకు చెందిన ప్రముఖ వేద పండితులు, బాలకృష్ణ ఆధ్యాత్మిక గురువు కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు,హోమాలు అభిషేకాలు నిర్వహించారు. కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు. బాలకృష్ణ తన కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఇక్కడకు వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బాలయ్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమానులు, ప్రజలను అనుమతించలేదు. పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశ రుద్రుల్లో ఒకరైన అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ఈ గ్రామంలో ఉండేవారి అంటారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ