‘సాహో’ రెండో పాట టీజర్.. లవ్ ఆంథమ్ ఆఫ్ దిస్ ఇయరట!!

ఈ ఏడాది మోస్ట్ వాంటెడ్ యాక్షన్ మూవీస్‌లో ‘సాహో’ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లోపల ‘సాహో’పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేందుకు చిత్ర ప్రచార కార్యక్రమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే టీజర్, ‘సైయా సైకో’ అనే పాటను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో రెండో పాటను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 2న విడుదల చేసే ఈ పాట టీజర్‌ను మంగళవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. Also Read: ‘యే చోట నువ్వున్నా’ అంటూ సాగే ఈ లవ్ ట్రాక్ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్‌లో ప్రభాస్, శ్రద్ధా లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ వైట్ సూట్‌లో నడుచుకుంటూ వచ్చే సీన్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. మంచు కొండలు, సరస్సు, లొకేషన్స్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ అయితే పైస్థాయిలో ఉంది. ఇవన్నీ బాగున్నా.. పాటలోనే అంత ఎట్రాక్షన్ కనిపించడం లేదు. ఏదో హిందీ పాటను అనువాదం చేసినట్టుగా ఉంది. ఈ టీజర్‌లో ‘లవ్ ఆంథమ్ ఆఫ్ దిస్ ఇయర్’ అంటూ పేర్కొన్నారు. కానీ, టీజర్ చూస్తుంటే అంతలేదనిపిస్తోంది. ‘సైయ్యా సైకో’ పాట వచ్చినప్పుడే చాలా మంది పెదవి విరిచారు. తెలుగు ప్రాంతీయతకు తగ్గట్టుగా ఈ పాట లేదని విమర్శించారు. మరి ఆగస్టు 2న ‘యే చోట నువ్వున్నా’ పూర్తి పాట విడుదలైతే ఏమంటారో. తొలి పాటను తనిష్క్ బాగ్చి స్వరపరచగా.. ఈ పాటను పంజాబీ కంపోజర్ గురు రంధవ కంపోజ్ చేశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ‘నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే.. నీ కన్నులు అలిసేలా నీక్కనిపిస్తాలే’ అంటూ పాట మొదలైంది. ‘సాహో’ సినిమా స్థాయిలో ఈ పాట లేదని అనిపిస్తోంది.
Comments
Post a Comment