వాణి కపూర్ బికినీ ‘వార్’.. స్టన్నింగ్!

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘వార్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అనువాదమై వస్తోంది. ఇటీవల విడుదలైన ‘వార్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. హృతిక్, టైగర్ యాక్షన్ స్టంట్లు చూసి ప్రేక్షకులు వహ్వా అన్నారు. టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయారు. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘వార్’ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడిగా నటిస్తోంది. టీజర్‌లో సముద్రపు ఒడ్డున బికినీలో మెరిసింది కూడా ఈమెనే. ఇప్పుడు ఆ లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. బికినీలో వాణి స్టన్నింగ్ లుక్‌కు ప్రశంసలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె అందాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. తన బికినీ లుక్‌కు ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడంపై వాణి స్పందించారు. ‘‘ప్రేక్షకుల నుంచి ఎప్పుడు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా ఆనందంగానే ఉంటుంది. ఈసారి అలాంటి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. యోగా, పైలేట్స్, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఎన్నో గంటలు జిమ్‌లో గడిపి ఇలా ఫిట్‌గా తయారయ్యాను. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. నన్ను సినిమాలో సిద్ ఎలా చూపించాలనుకున్నారనే విషయంలో ఆయన చాలా క్లియర్‌గా ఉన్నారు. ఈ పాత్ర కోసం తీసుకుంటోన్న డైట్ చాలా కష్టంగా ఉన్నా అది పాత్రకు లాభం చేకూరుస్తుందనే ఆనందం ఉంది’’ అని వాణి కపూర్ వెల్లడించారు. వాణి కపూర్ పాత్ర గురించి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోనే హ్యాండ్‌సమ్ హీరోగా పేరొందిన హృతిక్ రోషన్ పక్కన నటించడానికి స్టన్నింగ్, సూపర్ ఫిట్ గర్ల్ కావాలని మేం కోరుకున్నాం. మేం అనుకున్న లక్షణాలన్నీ వాణిలో ఉన్నాయి. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమాలో ఈ విధంగా కనిపించడానికి ఆమె ఎంతో కష్టపడింది. టీజర్‌లో ఆమెను చూసిన ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
Comments
Post a Comment